కరోనారోనా దేశంలో ఎవరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ కరోనా భారీన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు సైతం కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు కరోనా టెన్షన్‌తో బయటకు వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే కరోనా టెన్షన్‌తో ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. హర్యానా సీఎం మనోహర్లాల్ కట్టర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కట్టర్ క్వారంటైన్‌కు వెళ్లారు.
ఈ నెల 19న షెకావత్‌తో సట్లెజ్ – యమున అనుసంధానం చర్చల్లో కట్టర్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే షెకావత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు కట్టర్ ముందు జాగ్రత్త చర్యగా కట్టర్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటీవల తాను కలిసిన పలువురికి కరోనా రావడంతో ఆయన ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ నెల 26నుంచి హర్యానా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సమావేశాలు జరుగుతాయా లేదా అన్నది దానిపై అస్పష్టత నెలకొందిన్నారు.