కరోనా ఐపీఎల్‌ను వేటాడుతూ వెంటాడుతోంది. ఇప్పటికే మన దేశంలో కరోనా స్వైరవిహారం చేస్తోన్న నేపథ్యంలో బీసీసీ ఐపీఎల్‌ను ఇక్కడ నిర్వహించలేక చేతులు ఎత్తేసి చివరకు దుబాయ్‌లో టోర్నీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్ కూడా కుదించారు. ఇక ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లి ప్రాక్టీస్ చేస్తోన్న ఆటగాళ్లలో కరోనా కలవరం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొంతమంది ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బంది కరోనా భారీన పడ్డారు.
ఈ విషయాన్ని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 21న దుబాయ్ చేరుకుంది. అప్పటికే ఐపీఎల్ నిర్దేశించిన ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంది. ఇక ఇప్పుడు కరోనా పరీక్షలు చేయగా ఆటగాళ్లతో పాటు కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తేలిందట. దీంతో వీళ్ల క్వారంటైన్‌ను సెప్టెంబర్ 1 వరకు పెంచారు. ఇక తర్వాత వీరితో పాటు వీరి భార్యలకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు. వచ్చే నెల 17 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.