Moviesసుశాంత్ మెసేజ్ చేశాడు.. నెంబ‌ర్ బ్లాక్ చేశాను.. గుట్టు విప్పుతోన్న రియా

సుశాంత్ మెసేజ్ చేశాడు.. నెంబ‌ర్ బ్లాక్ చేశాను.. గుట్టు విప్పుతోన్న రియా

దివంగ‌త బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసు విచార‌ణ వేగంగా సాగుతుండ‌డంతో రియా ఒక్కో గుట్టు విప్పుతూ వ‌స్తున్నారు. జూన్ 14న సుశాంత్ మృతి చెంద‌గా.. ఆ రోజుకు ఆరు రోజుల ముందే రియా సుశాంత్ ఇంటినుంచి బ‌య‌ట‌క వ‌చ్చింది. సుశాంత్ ఇంటిని ఎందుకు విడిచానో చెప్పిన రియా సుశాంత్ త‌న‌ను ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని కోరినా.. ఆ త‌ర్వాత రోజు మెసేజ్ చేశాడ‌ని. అయితే ఆ త‌ర్వాత కోపంలో తాను సుశాంత్ నెంబ‌ర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాన‌ని చెప్పాడు.

తాను సుశాంత్‌ను ఒంట‌రిగా విడిచి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని.. అయితే సుశాంత్ తన సోదరి మీతు సింగ్‌ వస్తున్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి బ‌య‌ట‌కు పంపాడని.. సుశాంత్ సోద‌రి వ‌చ్చాకే తాను వెళ‌తాన‌ని చెప్పినా అత‌డు ఆమె రెండు గంట‌ల్లో వ‌స్తుంద‌ని చెప్పి  న‌న్ను వెళ్లాల‌ని కోరాడ‌ని రియా చెప్పింది. అయితే సుశాంత్‌ ఇంటి నుంచి తను వెళ్లిపోయాక జూన్‌ 9న ఎలా ఉన్నావు అని మెసేజ్ పెట్టాడ‌ని.. నేను ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు కాల్ చేయ‌కుండా కేవ‌లం మెసేజ్ మాత్ర‌మే చేశాడ‌న్న కోపంతో నేను సుశాంత్‌ను జూన్‌ 9న అతన్ని బ్లాక్‌ చేశాన‌ని చెప్పింది.

ఇక సుశాంత్ నా సోద‌రుడికి ఫోన్ చేసి రియా ఎలా ఉంద‌ని… త‌ను ఎప్పుడు మంచిగా ఉంటుందో చెప్పాల‌ని అడిగాడ‌ని కూడా రియా చెప్పింది. అయితే సుశాంత్ రియా నువ్వు నాకు కావాలి.. తిరిగి వ‌చ్చేయ్ అన‌లేద‌న్న కోపంతోనే నేను ఐడీ బ్లాక్ చేశాన‌ని రియా చెపుతోంది. మ‌రి రియా చెపుత‌న్న విష‌యం ఇలా ఉంటే సుశాంత్ కుటుంబ స‌భ్యుల వెర్ష‌న్ మాత్రం రియానే త‌మ వాడికి దూర‌మ‌య్యింద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news