విశాఖ‌లో పెళ్లి కొడుక్కి క‌రోనా… పెళ్లికి 500 మంది అతిథులు… దెబ్బ‌తో అంతా క్వారంటైన్‌లోకే..

విశాఖ‌లో ఓ పెళ్లి కొడుక్కి క‌రోనా పాజిటివ్ రావ‌డం… ఆ యువ‌కుడి పెళ్లికి హాజ‌రైన 500 మంది ఆ పెళ్లి కొడుకుతో రాసుకుని పూసుకుని తిర‌గ‌డంతో పాటు అక్క‌డే వారంతా భోజ‌నాలు కూడా చేయ‌డంతో ఆ దెబ్బ‌తో వారిలో ఒక్క‌టే టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. విశాఖ జిల్లాలోని కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో పెళ్లికి వ‌చ్చిన వారంద‌రికి టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. గ్రామానికి చెందిన యువ‌కుడు హైద‌రాబాద్ స‌మీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఉంటున్నాడు.

 

20 రోజుల క్రింద‌ట గ్రామానికి రాగా.. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌న్న అనుమానంతో కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. ఈ ఫ‌లితాలు న‌ర్సీప‌ట్నం ఏరియా ఆసుప‌త్రికి పంపించాడు. ఈ న‌మూనాలు రాక‌ముందే అత‌డు ఈ నెల 15న గ్రామానికి చెందిన ఓ యువ‌తిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అంతా హతాశులయ్యారు. అదే గ్రామంలోని చ‌ర్చిలో జ‌రిగిన ఇత‌డి వివాహానికి గ్రామంలో బంధువుల‌తో పాటు 90 మంది పాల్గొన్నారు. ఇక 500 మందికి పైగా ఈ పెళ్లికి రావ‌డంతో పాటు భోజ‌నాలు చేశారు. పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వివాహానికి హాజరైన వారిలో టెన్షన్‌ మొదలైంది. ఈ క్ర‌మంలోనే వీరిలో చాలా మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Leave a comment