Moviesవివాదాల బిగ్‌బాస్ 4లో కొత్త ట్విస్ట్‌... టీఆర్పీలు దుమ్ము రేగ‌డం ప‌క్కా

వివాదాల బిగ్‌బాస్ 4లో కొత్త ట్విస్ట్‌… టీఆర్పీలు దుమ్ము రేగ‌డం ప‌క్కా

ప్ర‌పంచ వ్యాప్తంగా బుల్లితెర‌పై వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్‌ ఫిక్షన్‌ షో బిగ్‌బాస్‌. యూర‌ప్‌లో పుట్టిన ఈ పాపుల‌ర్ షో మ‌న‌దేశంలో ముందుగా హిందీలో ప్ర‌వేశించింది. అక్క‌డ నుంచి సౌత్‌లో తెలుగు, త‌మిళ్ భాషల్లోకి రావ‌డంతో పాటు ఇక్క‌డ కూడా బాగా క్లిక్ అవుతూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం పంచుతోంది. ఇప్ప‌టికే తెలుగులో మూడు సీజ‌న్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగో సీజ‌న్ అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

 

మూడో సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జునే నాలుగో సీజ‌న్‌ను కూడా హోస్ట్ చేయ‌నున్నాడు. ఈ షోకు వ‌రుస‌గా రెండోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌కి రావడం చాలా సరదాగా అనిపించింది. గత సీజన్‌ గొప్ప విజయం అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదంతో పాటు సర్‌ప్రైజ్‌లు కూడా అందిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే నాగార్జున మూడు గెట‌ప్పుల్లో ఉన్న సీజ‌న్ 4 ప్రోమోకు మంచి స్పంద‌న కూడా ల‌భించింది.

 

ఈ సారి షోలో చాలా వినూత్న‌మైన కాన్సెఫ్ట్‌లు… ట్విస్టులు.. మ‌ధ్య‌లో గెస్టులుగా ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తులు వ‌స్తార‌ట‌. ఇక టాస్క్‌లు కూడా రెండు, మూడు సీజ‌న్ల‌లో బోరింగ్‌గా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ సారి ఆ మాట రాకుండా చాలా వినూత్నంగా, క్రియేటివ్‌గా రూపొందించార‌ని అంటున్నారు. ఈ సారి లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే వీరంతా వినోదం కోసం అర్రులు చాస్తోన్న టైంలో ఈ సారి కొత్త కాన్సెఫ్ట్‌లు, స‌రికొత్త వివాదాల టాస్క్‌ల‌తో బిగ్‌బాస్ 4 టీఆర్పీలు దుమ్ము రేప‌డం ప‌క్కా అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news