కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ సోకింది. గత రెండు రోజుల్లో కరోనాతో మంత్రులు, మాజీ మంత్రులు సైతం మరణిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా ఎవ్వరిని వదలడం లేదు. తాజాగా తమిళనాడు భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రి స్పష్టం చేసింది.
ఇక గవర్నర్ కొద్ది రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆయన్ను ఈ మూడు రోజుల పాటు డాక్టర్ల బృందం పర్యవేక్షించనుంది. ఆయనకు కరోనా అనుమానాలు ఉన్నట్టు పరీక్షలు చేసిన కొద్ది గంటల్లోనే పాజిటివ్ ఉన్నట్టు చెప్పారు. ఇక గత కొద్ది రోజుల క్రితమే అక్కడ రాజ్‌భవన్‌లో ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు.
ఇక ఇప్పటి వరకు రాజ్‌భవన్లో మొత్తం 84 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే తమిళనాడులో పలువురు మంత్రులు కరోనా భారిన పడ్డారు. కాగా, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో వివిధ ఆంక్షలతో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.