వ‌ర్మ అల్లు క‌థ ఇదే… ఆ ఫ్యామిలీని ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నాడే..!

వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అల్లు అనే టైటిల్‌తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో వ‌ర్మ చేస్తోన్న ఈ సినిమా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మెగా ఫ్యామిలీని వ్య‌తిరేకించే వారు సోష‌ల్ మీడియాలో వీరిని ఆటాడుకుంటున్నారు. వ‌ర్మ తాను తెర‌కెక్కించే అల్లు సినిమా ఫిక్ష‌న‌ల్‌గా ఉంటుంద‌ని చెప్పాడు. ఇక వ‌ర్మ త‌న సినిమా క‌థ ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బామ్మ‌ర్ది ఏం చేశాడ‌నేదే ఈ సినిమాలో ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు.

 

జ‌న రాజ్యం పార్టీని స్థాపించ‌డంతో ఈ సినిమా క‌థ మొద‌ల‌వుతుంద‌ని చెప్పిన వ‌ర్మ పెద్ద బాంబు పేల్చాడు. ఇక ఈ సినిమాకు అల్లు టైటిల్ పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలు కూడా వ‌ర్మ చెప్పాడు. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్రధారులు అంద‌రూ ర‌క‌ర‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటార‌ని.. అందుకే ఆ పేరు పెట్టామ‌న్నాడు. త‌న‌కు మంచి జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు… వేరే వాడికి చెడు జ‌ర‌గాలంటూ ప్లాన్ అల్లు అనే స్ట్రాట‌జీతో ఓ వ్య‌క్తి ప్లాన్లు అల్లడంలో ఆరితేరి పోయి ఉంటాడ‌ని.. పెద్ద స్టార్ అయిన త‌న బావ ప‌క్క‌నే ఉంటూ త‌న మైలేజీ ప‌డిపోకుండా ఉండ‌టానికి త‌మ ఇంటి అల్లుడును కూడా మ‌ర్చిపోయి ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడ‌ని చెప్పాడు.

 

ఇక ఈ సినిమాలో ఎ.అర‌వింద్‌, కె.చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్.‌బాబు త‌దిత‌రులు ఉంటార‌ని చెప్పాడు. ఇక ఓ అల్లిక‌ల మాస్ట‌ర్ క‌థే ఈ సినిమా అని వ‌ర్మ చెప్పాడు. వ‌ర్మ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే ఫైన‌ల్‌గా ఈ సినిమా మెగా ఫ్యామిలీ, అల్లు అర‌వింద్‌ను టార్గెట్‌గా చేసుకుని తీస్తోందే అని అర్థ‌మ‌వుతోంది. మ‌రి దీనిపై మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో ? చూడాలి.

Leave a comment