కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను రివర్స్ చేయడంతో పాటు వారి ఆశలను అడియాసలు చేసింది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు కూడా పెద్ద దెబ్బే పడింది. కరోనా దెబ్బతో అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైతం డైలమాలో పడిందట. హైదరాబాద్‌లోనే మకాం వేసి ఇక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తోన్న ఆమెకు కొంత కాలంగా సక్సెస్ లేదు.
ఎప్పుడో అడపాదడపా మాత్రం కుర్ర హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. ఆమె పనైపోయిందనుకుంటోన్న టైంలో రెండు అవకాశాలు వచ్చాయి. సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తోంది. ఇక చావు కబురు చల్లగా అనే మరో సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఇప్పుడు ఇవి పూర్తయినా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఈ రెండు సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయా ? అన్న సందిగ్దంలో పడింది.
దీంతో ఇప్పుడు ఆమె ఈ రెండు సినిమాలపై ఆశలు వదిలేసి.. వెబ్సీరిస్లపై దృష్టి పెట్టిందంటున్నారు. అవసరం అయితే హాట్‌గా కనిపించేందుకు అయినా సిద్ధమే అని.. ఛాన్సులు కావాలని డైరెక్టర్లను అడిగే పరిస్థితికి ఆమె వచ్చేసిందట. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో మళ్లీ హీరోయిన్గా నిలదొక్కుకోవాలనుకున్న లావణ్యను కరోనా పెద్ద దెబ్బే కొట్టిందనే చెప్పాలి.