పంచంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజుకో సరికొత్త లక్షణంతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా భారీన పడుతోన్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు ఎక్కువ కావడంతో అసలు కరోనా రూపం ఎప్పుడు ఎలా మారుతుందో ? కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే కరోనా గురించి మలేషియా శాస్త్రవేత్తలు ఓ భయంకర నిజాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ కన్నా పది రెట్ల ఎక్కువ వేగంతో విస్తరించే ఓ కొత్త వైరస్ రకాన్ని గుర్తించినట్టు మలేషియా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
డీ614జీ గా ఈ కొత్త రకం వైరస్‌ను పిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి ఈ కొత్త వైరస్ ఈ కొత్త రూపాన్ని సంతరించుకుందని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. భారత్ నుంచి మలేషియా తిరిగి వెళ్లిన ఓ రెస్టారెంట్ యజమాని క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ దాదాపు 45 మందికి ఈ వైరస్‌ను అంటిచినట్టు చెపుతున్నారు. ఈ కొత్త రకం డీ614జీ వైరస్ ఇప్పటికే అమెరికా, ఐరోపాల్లో కనిపించిందని, దీని వల్ల కరోనా మహమ్మారి రెండు సారి విజృంభించే అవకాశాలున్నాయని మలేషియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు. ఈ వైరస్ విజృంభిస్తే దీనికి బ్రేకులు వేయడం చాలా కష్టమని కూడా నిపుణులు చెపుతున్నారు.