బాలీవడ్‌లో మ‌‌రో న‌టి ఆత్మ‌హ‌త్య‌… మోసపోయాన‌ని సూసైడ్ నోట్‌

బాలీవుడ్‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో న‌టి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ యేడాదిలోనే బాలీవుడ్‌లో ప‌లువురు ముఖ్యులు మృతి చెందారు. సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య విషాదం నుంచి కోలుకోక ముందే తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి పోలీసులు సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లో చేసిన వ్యాఖ్య‌లు ప‌లు సందేహాల‌కు కార‌ణంగా ఉన్నాయి.

 

అంద‌రికి విశ్వాస‌పాత్రులుగా ఉండండి… అయితే ఎవ్వ‌రిని న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆమె చెప్పింది… ఈ ప్రజలు చాలా స్వార్థపరులు ఇతరులను పట్టించుకోరు అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. ఇక ఆమె సూసైడ్ నోట్ ద్వారా ప‌లు విష‌యాలు వెల్ల‌డి అయ్యాయి. ఆమె మలాడ్‌లోని విజ్ డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే సంస్థలో 10వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. 2019 డిసెంబర్‌లో మెచ్యూరిటీ తేదీ తర్వాత కూడా ఆ డబ్బును చెల్లించలేద‌ని తెలుస్తోంది.

 

అలాగే మనీష్ ఝా అనే వ్యక్తి, లాక్ డౌన్ సమయంలో అనుపమ ద్విచక్ర వాహనాన్ని తీసుకొని తిరిగి ఇవ్వలేదని కూడా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. కాగా బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ ఉపాధి కోసం ముంబై వ‌చ్చి ఇక్క‌డ ఉంటున్నారు.

Leave a comment