తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్ ఆరవ్ నఫీజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నఫీజ్ తన ప్రియురాలు, స్నేహితురాలు అయిన మోడల్ రేహీని త్వరలోనే పెళ్లాడనున్నాడు. వచ్చే ఆరో తేదీన చెన్నైలో వీరి వివాహం జరగనుంది. ఇక బిగ్‌బాస్‌లో ఆరవ్.. నటి ఓవియాతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమాయణం సందర్భంగా, కెమిస్ట్రీ బాగా కుదరడంతో బిగ్‌బాస్ రేటింగులు దుమ్ము రేపాయి. వీరికి తర్వాత ప్రత్యేకంగా ఫ్యాన్స్ టీంలు కూడా ఏర్పడ్డాయి.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆరవ్, ఓవియా కొన్నాళ్లు కలిసే ఉన్నా తర్వాత వీరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. అప్పుడే ఓవియా సూసైడ్ ఎటెంప్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక యేడాది కాలంగా తన స్నేహితురాలు రేహీతో ప్రేమలో ఉన్న ఆరవ్ ఇరు వైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు.
ఇక ఆరవ్ కెరీర్ విషయానికి వస్తే అతడు నటించిన తొలి సినిమా రాజా భీమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. దర్శకుడు నరేశ్ సంపత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రేహి విషయానికొస్తే మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. ప్రముఖ డైరెక్టర్ గౌతం మీనన్ రూపొందిస్తున్న జోషువా ఇమాయి పోల్ కాకా అనే రొమాంటిక్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది.