యువరత్న నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన దాతృత్వాన్ని, తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూనే ఉంటారు. బాలయ్య ఎప్పటికప్పుడు నిరుపేదలకు ఎంతో మందికి సాయం చేసినా వాటిని బయటకు చెప్పుకునేందుకు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడడు. కరోనా వేళ బాలయ్య ఎంతో మందికి సాయం చేశారు. అలాగే తన నియోజకవర్గం అయిన హిందూపురంతో పాటు అటు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
తాజాగా బాలయ్య హిందూపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రానికి 55 లక్షల విలువైన మందులు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఇతర సామగ్రి విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే కరోనా నిర్దారణకు బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రు 1.25 కోట్లు సాయం చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలోని 12 వేల మందికి మందులు, ఇతర సామాగ్రి కూడా అందజేశారు. ఇక పలువురు కోవిడ్ రోగుల కోసం తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ నుండి ఉచితంగా వైద్యం చేయించారు.
ఇక ఈ హాస్పటల్లో ఎంతో రిస్క్ చేసి మరీ వైద్యం చేస్తోన్న వైద్యులకు ఎన్నో పరికరాలు అందించారు. ఇక ఇప్పుడు తన నియోజకవర్గమైన హిందూపురంలో కోవిడ్ ఆసుపత్రికి రు. 55 లక్షలలో పరికరాలు అందించి తన మంచి మనస్సును మరోసారి చాటుకున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.