ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిని సీఎం జగన్ ఖరారు చేశారు. నిన్నటి వరకు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించబోతున్నారు. డాక్టర్ సురేష్‌బాబు ఎవరో కాదు సోమవారం మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ పెనుమత్స సాంబశివరాజు కుమారుడు.
జగన్ పార్టీ పెట్టినప్పటి ఉంచే సాంబశివరావు వైసీపీలో ఉన్నారు. జిల్లాలో మంత్రి బొత్స దూకుడు ముందు సాంబశివరావు వెనకపడిపోయారు. చివరకు ఆయన కుటుంబానికి కూడా సీటు లేని పరిస్థితి వచ్చింది. ఇక వయస్సు రీత్యా సాంబశివరాజు సైతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఈ క్రమంలోనే ఇప్పుడు సాంబశివరాజు మరణం తర్వాత ఆయన కుటుంబానికి న్యాయం చేయాలనే జగన్ ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ ఖరారు చేశారని టాక్..?
వాస్తవంగా ఈ స్థానానికి ముందుగా మరో నేత పేరు అనుకున్నా చివర్లో సురేష్‌బాబు పేరు అనూహ్యంగా ఖరారైంది.