Politicsఏపీలో క‌రోనా విల‌యం... ఏ మాత్రం త‌గ్గ‌ని కేసుల జోరు...

ఏపీలో క‌రోనా విల‌యం… ఏ మాత్రం త‌గ్గ‌ని కేసుల జోరు…

ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎంత మాత్రం ఆగ‌డం లేదు.. క‌రోనా విల‌యం తాండ‌వం చేస్తుండ‌గా.. కేసులు జోరు త‌గ్గ‌డం లేదు. స‌గటున రోజుకు 8- 10 వేల మ‌ధ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా ఈరోజు 8,555 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇక గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 67 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,764 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,474 మంది మృతి చెందారు. ఇక ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 74,404 గా ఉంది. ఇక క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 82 వేలుగా ఉంది.

 

రాష్ట్రంలో క‌ర్నూలు, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు, నెల్లూరు న‌గ‌రాల్లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల క‌న్నా తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ కేసులు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఈ జిల్లాలోనే ఎక్కువుగా న‌మోదు అవుతున్నాయి. ప్ర‌భుత్వం కూడా చేతులు ఎత్తేస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో కేసులు జోరు ఆగ‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news