ఏపీలో ఆ కోవిడ్ ఆసుపత్రి న‌ర‌కానికి దగ్గ‌రి దారేనా… దండం పెట్టి వేడుకుంటున్నారు…!

ఏపీలో కొన్ని కోవిడ్ ఆసుప‌త్రులు న‌ర‌కానికి న‌క‌ళ్లుగా మారుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీటిలో ముఖ్యంగా విశాఖ కోవిడ్ ఆసుప‌త్రి నుంచి ఓ వృద్ధులు వ‌దిలిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఏపీలో క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే కేసులు 1.50 ల‌క్ష‌ల‌కు చేరుకుంటే.. మ‌ర‌ణాలు కూడా 1400 వ‌ర‌కు ఉన్నాయి. రోజు రోజుకు కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. ప్ర‌భుత్వం కూడా ముందు క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసినా ఆ త‌ర్వాత చేతులు ఎత్తేసిన ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.

 

ఇక విశాఖ జిల్లాలోని విమ్స్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోంది. కరోనా సోకిన బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ క‌న‌ప‌డుతోన్న దృశ్యాలు హృద‌య విదార‌కంగా ఉంటున్నాయి. కోవిడ్ రోగులు మంచంపై నుంచి కింద‌ప‌డినా కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఓ వృద్ధుడు అయితే న‌న్ను కాపాడండి.. కాపాడండి అంటూ ఆరుస్తోన్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

 

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చి ఇక్క‌డ వారిని కాపాడాలంటూ ఓ యువ‌కుడు వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇప్పుడు వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఏదేమైనా వృద్ధులు, క‌రోనా రోగులకు విశాఖ విమ్స్ ఆసుప‌త్రిలో న‌ర‌కం క‌నిపిస్తోంద‌ని అక్క‌డి వారు చెపుతుంటే బాధాక‌రంగా ఉంది.

Leave a comment