Moviesఅందుకే సోష‌ల్ మీడియాకు దూరం.. అనుష్క చెప్పిన షాకింగ్ రీజ‌న్‌

అందుకే సోష‌ల్ మీడియాకు దూరం.. అనుష్క చెప్పిన షాకింగ్ రీజ‌న్‌

టాలీవుడ్‌లో మ‌హిళా ప్రాధాన్య‌త సినిమాలు అంటే ఇప్పుడు గుర్తు వ‌చ్చే ఒకే ఒక్క హీరోయిన్ జేజ‌మ్మ అనుష్క‌. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి ఇలా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో అనుష్క‌కు తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమాలే కాకుండా పంచాక్ష‌రి, భాగ‌మ‌తి సినిమాలే కాకుండా ఇప్పుడు ఆమె త్వ‌రలోనే నిశ్శ‌బ్దం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జేజ‌మ్మ అల‌రించినా, రుద్ర‌మ‌దేవిగా రాణి పాత్ర‌లో రాణించినా, బాహుబ‌లిలో దేవ‌సేగా క‌త్తి తిప్పినా ఆమెకే చెల్లింది.

ఆమె న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉన్నా క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. ఇక సామాజిక మాధ్య‌మాల‌కు చాలా దూరంగా ఉండే అనుష్క ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్ర‌మే త‌న అభిమానుల‌కు అందుబాటులో ఉంటోంది. ఇక మీరు సెల‌బ్రిటీలు ఎక్కువుగా వాడే ట్వీట్ట‌ర్‌లోకి ఎప్పుడు వ‌స్తార‌న్న ప్ర‌శ్న‌కు ఆమె త‌న అభిప్రాయం చెప్పింది. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ‌.. కొత్త వాళ్ల‌తో త్వ‌ర‌గా క‌ల‌వ‌లేను.. సినిమాలు లేక‌పోతే ఇళ్లే నా లోకం.. బ‌య‌ట విష‌యాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను అని చెప్పింది.

ఇక సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌త్యేకంగా ఏమీ లేక‌పోయినా వాటిలో ఉంటే ఎక్కువుగా టైం వేస్ట్ అవుతుందని… అందుకే వాటికి దూరంగా ఉంటాన‌ని చెపుతోంది. త‌న‌ను అభిమానులు ట్విట్ట‌ర్‌లోకి ర‌మ్మ‌ని కోరుతున్నా తాను రాక‌పోవ‌డానికి ఇదే కార‌ణం అని అనుష్క చెపుతోంది. నిజానికి వీటిపై త‌న‌కు పెద్ద అవ‌గాహ‌న కూడా లేద‌ని జేజ‌మ్మ చెప్పేసింది. ఇక త‌న మ‌న‌స్సుకు ఎప్పుడు త‌డితే అప్పుడే తాను ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇస్తానంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news