Moviesకింగ్ బ‌ర్త్‌డే కు అదిరే గిఫ్ట్ ఇచ్చిన చైతు... అక్కినేని ఫ్యాన్స్‌కు...

కింగ్ బ‌ర్త్‌డే కు అదిరే గిఫ్ట్ ఇచ్చిన చైతు… అక్కినేని ఫ్యాన్స్‌కు డ‌బుల్ బొనంజా

కింగ్ నాగార్జున గత ఏడాది షష్ఠి పూర్తి  వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం నాగ్ 61వ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే అక్కినేని ఫ్యాన్స్‌కు రెండు బంప‌ర్ గిఫ్ట్‌లు వ‌చ్చాయి. ఒక‌టి నాగ్ న‌టిస్తోన్న వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక నాగ్ ఎంత రొమాంటిక్ హీరోగా ఎదిగాడో ఇప్పుడు నాగ్ కుమారుడు చైత‌న్య సైతం తండ్రినే అనుస‌రిస్తూ రొమాంటిక్ హీరోగా అదే త‌ర‌హా సినిమాలు చేస్తున్నాడు.

చైతు ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగానే తెర‌కెక్కుతోంద‌ట‌. తాజాగా నాగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ల‌వ్ స్టోరీ కొత్త పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు. నాగ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతూనే సాయిప‌ల్ల‌వి – చైతు ప‌క్క‌నే కూర్చొని ఉన్న రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఓవ‌రాల్‌గా చైతు త‌న తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుండి షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news