సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, ఎంపీల పీఏలు, జర్నలిస్టులు కలిపి మొత్తం 143 మంది తనపై ఐదు వేల సార్లకు పైగా అత్యాచారం చేశారంటూ ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేయగా వారు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్‌ను కూడా నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ప్రచారం జరుగుతంది.
సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో పాటు తన పేరు బయటకు రావడంతో యాంకర్ ప్రదీప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు బాధపెడుతున్నాయని.. ఇలాంటి సున్నిత విషయాల్లో తన పేరు బయటకు లాగుతూ ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. యూట్యూబ్స్, వెబ్‌సైట్స్ కేవలం వ్యూస్ కోసమే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని అసత్య ప్రచారాలు చేసేవాళ్లపై తాను ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.
బాధిత యువతికి న్యాయం జరగాలంటూనే… అసలు నిజాలు దాచేసి తనను టార్గెట్ చేయడంతో పాటు తనను ఎదగనీయకుండా చేస్తున్నారేమోనన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.