Moviesయాంక‌ర్ ఝాన్సీ రెండో పెళ్లిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ

యాంక‌ర్ ఝాన్సీ రెండో పెళ్లిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ

సీనియ‌ర్ యాంక‌ర్ ఝాన్సీ కెరీర్ తొలినాళ్ల‌లోనే జోగినాయుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు విడిపోయారు. అప్ప‌టి నుంచి ఝాన్సీ రెండో పెళ్లిపై ఎప్ప‌టిక‌ప్పుడు పుకార్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ పుకార్లు విని చివ‌ర‌కు ఝాన్సీకి కూడా చిర్రెత్తుకొచ్చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న రెండో పెళ్లి వార్త‌ల‌పై ఝాన్సీ క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లిపై జ‌నాలు ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడేసుకుంటున్నార‌ని… ఇప్పుడు తాను కొత్త‌గా చెప్పేదేం లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

 

ప్రేక్ష‌కులు త‌న పెళ్లికి సంబంధించి వారిలో వారే వంద ర‌కాల స‌మాధానాలు చెప్పుకుంటున్నారు. వాళ్ల బుర్ర‌ల్లో వాళ్లే రీల్స్ కూడా తిప్పేసుకుంటున్నారు. వాళ్ల మెద‌ళ్ల‌లో వారే బొమ్మ‌లు వేసుకుని కామెంట్లు కూడా రాసుకుంటున్నారు… ఈ టైంలో తాను వాళ్ల‌ను డిజ‌ప్పాయింట్ చేయ‌ద‌లుచుకోలేద‌ని ఆమె వ్య‌గ్యంగా స్పందించారు.

 

ఇక తాను రెండో పెళ్లి చేసుకుంటే అంద‌రికి చెప్పే చేసుకుంటాన‌ని కూడా అన్నారు. విడాకులు అయిన తర్వాత ఝాన్సీ తన బిడ్డతో ఒంటరిగా ఉంటోంది. రెండేళ్ల క్రితమే జోగినాయుడు మరో పెళ్లి చేసుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news