Politicsబ్రేకింగ్‌: అమిత్ షా ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్... ఆందోళ‌న‌కర వార్త‌లు

బ్రేకింగ్‌: అమిత్ షా ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్… ఆందోళ‌న‌కర వార్త‌లు

బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఆరోగ్య ప‌రిస్థితిపై ఇప్పుడు ఆందోళ‌న‌క‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం క‌రోనా భారీన ప‌డిన ఆయ‌న కోలుకున్నారు. వైద్యులు డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న తీవ్ర‌మైన శ్వాస‌కోస స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని.. నీర‌సంతో పాటు ఒంటి నొప్పులు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే తెల్ల‌వారు ఝామున 2.30 గంట‌ల‌కు మ‌ళ్లీ ఆయ‌న ఎయిమ్స్‌లో చేరారు. ఈ నేపథ్యంలో కోవిడ్ టెస్టులు జరపగా నెగిటివ్ వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచే ఆఫీసు వ్యవహారాలు చక్కబెడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెపుతున్నా… క‌రోనా వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యం కాస్త క్షీణించింద‌ని కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news