Gossipsవ‌కీల్‌సాబ్‌పై కొత్త డౌట్లు... నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

వ‌కీల్‌సాబ్‌పై కొత్త డౌట్లు… నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాపై ప‌వ‌న్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో మార్చిలో రావాల్సిన సినిమా మే నెల‌లో వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డింది. ఇక సెప్టెంబ‌ర్ 2వ తేదీన ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

 

ఈ వార్త‌తో ప‌వ‌న్ అభిమానులు ముంద‌స్తు సంబ‌రాలు చేసుకున్నారు. అదే రోజున మ‌రో పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేస్తార‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు సరికొత్త డౌట్లు వ‌స్తున్నాయి. ఆ రోజు టీజ‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని అంటున్నారు. టీజ‌ర్ ఇంకా రెడీ కాలేద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ కాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ అభిమానులకు దిల్ రాజు ఏమన్నా తీపి కబురు అందిస్తారా ? లేదా ? ప‌వ‌న్ అభిమానుకు మ‌రోసారి నిరాశేనా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news