Gossipsప్రభాస్ సినిమాలో అదే హైలైట్ కానుంది.. ఏమిటో అంటోన్న ఫ్యాన్స్!

ప్రభాస్ సినిమాలో అదే హైలైట్ కానుంది.. ఏమిటో అంటోన్న ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఫ్లాష్‌బ్యాక్‌ సీక్వెన్స్ ఉందని, అందులో ప్రభాస్ గెటప్‌ మరింత అదిరిపోనుందని తెలుస్తోంది. ఈ సరికొత్త గెటప్‌ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్‌ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు దీన్ని చూసేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్షన్ చేస్తుండగా యువి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లోకల్లా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news