Moviesస్టార్ హీరో ట్రైలర్‌ను తొక్కేసిన వకీల్ సాబ్

స్టార్ హీరో ట్రైలర్‌ను తొక్కేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తరువాత పవన్ ఈ సినిమాతో రానుండటంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

వకీల్ సాబ్ అనే టైటిల్‌తో బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కేక ఉండటంతో ప్రేక్షకులు ఆ ఫస్ట్ లుక్‌ను తెగ వైరల్ చేశారు. కేవలం 24 గంటల్లో ఈ ఫస్ట్ లుక్ ఏకంగా 3.5 మిలియన్ల ట్రెండింగ్‌తో తన సత్తా చాటుకుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ మేనియాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ ట్రైలర్ కొట్టుకుపోయింది. అసలు సూర్యవంశీ ట్రైలర్ రిలీజ్ అయ్యిందనే విషయమే మన తెలుగు వారికి తెలీకుండా పోయింది అంటే, పవన్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతోంది.

ఇక వకీల్ సాబ్ అనే టైటిల్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి పవన్ రెడీ కాగా ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news