యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ ఉందని, అందులో ప్రభాస్ గెటప్ మరింత అదిరిపోనుందని తెలుస్తోంది. ఈ సరికొత్త గెటప్ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు దీన్ని చూసేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్షన్ చేస్తుండగా యువి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లోకల్లా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.