అలివేలు వెంకటరమణగా వస్తున్న మ్యాచో స్టార్‌

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీటీమార్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాక సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా దర్శకుడు తేజ డైరెక్షన్‌లో గోపీచంద్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తేజ ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కాగా గోపీచంద్‌తో ఆయన చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో తేజ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్‌ను తేజ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మంచి కథనం ఉన్న సినిమాకు అంతే మంచి టైటిల్ పెట్టడంలో తేజ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.

ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్ మూవీకి కూడా ఇలా లేడీ ఓరియెంటెడ్ టైటిల్ పెట్టడంలో ఆంతర్యం ఏమిటా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక గతంలో తేజ డైరెక్ట్ చేసిన జయం, నిజం చిత్రాల్లో గోపీచంద్ విలన్ పాత్రల్లో నటించాడు. మరి ఈ సారి తేజ గోపీచంద్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment