పవన్‌ను వదిలి చిరును పట్టుకున్న భీష్మ

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో నితిన్ అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. కొంత గ్యాప్ తరువాత నితిన్ నటిస్తున్న ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్‌లో నితిన్ మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతూ కనిపించాడు. గతంలో తన ప్రతి సినిమాలో పవన్‌ను ఫాలో అయిన నితిన్, ఈసారి మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సాంగ్‌లో నితిన్ నాలుగు రంగులు కనిపించే ఓ చొక్కాను వేసుకుని కనిపించాడు. గతంలో చిరంజీవి నటించిన విజేత చిత్రంలో ఆయన ఇలాంటి షర్టు వేసుకోవడం గమనార్హం.

దీంతో మెగాస్టార్‌కు విజేత చిత్రం ఎలాంటి హిట్‌ను అందించిందో అంతకంటే పెద్ద విజయాన్ని భీష్మ చిత్రం నితిన్‌కు అందించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని పోస్టర్స్, సాంగ్స్ భీష్మ చిత్రంపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.