మహేష్ బ్యూటీకి చెక్ పెట్టిన బన్నీ బ్యూటీ

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు హీరోయిన్లదే హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటిస్తు్న్న పూజా హెగ్డేతో పాటు కన్నడ బ్యూటీ రష్మిక మందన కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వరుసబెట్టి సినిమాలను చేయడమే కాకుండా వాటిని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలపడంతో వీరిద్దరినీ తమ సినిమాలో యాక్ట్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు.

అయితే ఈ ఇద్దరి హీరోయిన్లలో ఎవరినో ఒకరిని తీసుకుంటున్న చిత్ర యూనిట్, తమకు అనుకూలంగా ఉన్నవారినే చివరకు సెలెక్ట్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీని పరశురాం డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా రష్మిక మందనను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. కానీ ఇటీవల అల వైకుంఠపురములో వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూజా హెగ్డేను ఈ సినిమాలో తీసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపారు.

అంతేగాక, గతంలో ఆమెకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు రష్మికను తప్పించి ఆమె ప్లేస్‌లో పూజా హెగ్డేనే తీసుకోవడానికి చిత్ర నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఇలా రష్మిక అవకాశాలను పూజా ఎగరేసుకుపోవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తమ హీరోయిన్ మాత్రం వరుస సినిమాలను చేజిక్కించుకోవడంతో పూజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు.

Leave a comment