ఖైదీ రీమేక్‌కు హీరో ఓకే చెప్పాడట

తమిళంలో తెరకెక్కిన ఖైదీ సినిమాను తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ యాక్టిగ్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఔట్ అండ్ ఔట్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కథ తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించడంతో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాను నార్త్‌లో రీమేక్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోను పెట్టి ఈ సినిమా రీమేక్ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. అనుకున్నదే అదనుగా ఈ సినిమాలో హీరోను కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

బాలీవుడ్‌లో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో అజయ్ దేవ్గన్‌తో ఖైదీ రీమేక్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. పలు సౌత్ సినిమాలను రీమేక్ చేసిన అజయ్ దేవ్గన్, సింగం సినిమాల సిరీస్‌తో అదిరిపోయే బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు. మరోసారి తనకు అచ్చివచ్చిన రీమేక్ కథతో బాలీవుడ్‌ను దున్నేద్దామని రెడీ అవుతున్నాడు ఈ హీరో.

Leave a comment