Gossipsమరో సినిమాను లైన్‌లో పెట్టిన నాని

మరో సినిమాను లైన్‌లో పెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. ఇటు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా నాని సినిమాలు చేసి రిలీజ్ చేస్తుండటంతో అతడి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. కాగా నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీ ‘టక్ జగదీష్’ను పట్టాలెక్కించేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ముగించక ముందే తన నెక్ట్స్ మూవీ టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకిర్త్యన్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా నాని, ఆపై సినిమాను కూడా అప్పుడే ఓకే చేశాడు. మెంటల్ మదిలో, బ్రోచెవారెవురా వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ నాని కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసి అతడికి వినిపించాడు.

ఈ కథ విన్న నాని వెంటనే అతడికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఇక ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు, వచ్చే ఏడాదిలో ఇది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వరుసగా సినిమాలు చేస్తున్న నాని వాటిని సూపర్‌హిట్లుగా మలుస్తాడా లేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడతాడా అనేది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news