ఆర్ఆర్ఆర్ వాయిదా.. కలిసొచ్చిందంటున్న కన్నడ సినిమా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ఆల్‌టైమ్ రికార్డులను తిరగరాసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. రిలీజ్ డేట్‌ను మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. జూలై 30న రిలీజ్ చేయాలనుకున్న సినిమాను మరోసారి వాయిదా వేసి వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ జూలై నుండది జనవరికి వాయిదా వేయడంతో జూలై 30న మరో పెద్ద మూవీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కన్నడ హీరో యశ్ నటించిన ‘కేజిఎఫ్’ చిత్రం అన్ని భాషల్లో తెరకెక్కి బాక్సాఫిస్ వద్ద సూపర్ సక్సెస్‌‌ను అందుకుంది. ఈ సినిమా‌లో యశ్ యాక్టింగ్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

భారీ అంచనాలున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేద్దామనుకున్న డేట్‌కు ఈ సినిమాను రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ డేట్‌ కేజిఎఫ్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

Leave a comment