భీష్మపై హీరోయిన్ సీరియస్.. అందుకే అంటోన్న బ్యూటీ!

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మచిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక ఇప్పటికే మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. మరి ఈ బ్యూటీకి భీష్మ చిత్రంపై ఆగ్రహం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా?

అయితే ఈ సినిమాపై ఆగ్రహంగా ఉన్నది రష్మిక మందన కాదు. ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించిన బ్యూటీ హెబ్బా పటేల్ తనకు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కుతుందని ఆశించిందట. అయితే ఆమెకు కేవలం ఓ కేమియో పాత్ర మాత్రమే ఇచ్చారు చిత్ర యూనిట్. అంతేగాక ఆమె పాత్రకు సంబంధించిన సీన్లను కూడా చిత్ర యూనిట్ తొలగించిందట. దీంతో హెబ్బా చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహానికి గురైందట.

అందుకే భీష్మ చిత్ర ప్రమోషన్స్‌లో ఎక్కడా ఈ బ్యూటీ కనిపించలేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ బ్యూటీ చిత్ర యూనిట్‌పై అలిగి చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని వారు అంటున్నారు. మరి ఫేడవుట్ అవుతున్న హీరోయిన్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం మంచిది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.