సరిలేరు నీకెవ్వరులో బెండు తీయనున్న రెండు ఎపిసోడ్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు అని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో రెండు కీలకమైన ఎపిసోడ్స్ ఉన్నాయని, అవి సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు సాగే ట్రెయిన్‌ సీన్‌లో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారట చిత్ర యూనిట్. ఈ 30 నిమిషాలే సినిమాకు హైలైట్ కానున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 30 నిమిషాల సీన్ ఫస్టాఫ్‌లో రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇకపోతే సెకండాఫ్‌లో వచ్చే ఎలుకతో కామెడీ సీన్ కూడా నవ్వులు పూయిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఎలుకతో వెన్నెల కిషోర్, సుబ్బరాజులు చేసే కామెడీ మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ అంటోన్నారు. ఈ సీన్‌లో వారికి తోడు మహేష్ కూడా తనదైన కామెడీని పండించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు కామెడీ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

Leave a comment