Gossipsపట్టువదలని పూరీ.. ఆమె కోసమేనట తాపత్రయం!

పట్టువదలని పూరీ.. ఆమె కోసమేనట తాపత్రయం!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రీసెంట్‌గా యంగ్ హీరో రామ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరీ ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరీని పెట్టి రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు పూరీ కసరత్తు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేయాలని చూస్తు్న్నాడు. అయితే అమ్మడు తెలుగులో ఎంట్రీకి నో అని చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఫైటర్ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ లేదని అంటున్నాయి సినీ వర్గాలు. కానీ పూరీ మాత్రం ఈ సినిమాలో ఎలాగైనా జాన్వీ కపూర్‌నే నటింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడట. ఆమెకు ఈ సినిమాలో అదిరిపోయే పాత్ర దక్కుతుందని, ఆమె మాత్రమే ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని పూరీ భావిస్తు్న్నాడట. అందుకే ఆమె తండ్రి బోనీ కపూర్ చుట్టూ తిరుగుతున్నాడట పూరీ. మరి పూరీ కోరికకు జాన్వీ ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news