ప్రతిరోజూ పండగే క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ప్రతి రోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు తేజు వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతూ వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని తేజు చాలా కష్టపడ్డాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.

రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కథే హీరో కావడంతో జనాలు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా తేజు కెరీర్‌లో హయ్యె్స్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కాగా ఈ సినిమా టోటల్ రన్‌లో కూడా తేజు కెరీర్‌లో హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో తేజు అండ్ టీమ్ హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో ఏరీయాలవారీ కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 12.35 కోట్లు
సీడెడ్ – 3.93 కోట్లు
నెల్లూరు – 0.92 కోట్లు
కృష్ణా – 2.18 కోట్లు
గుంటూరు – 2.01 కోట్లు
వైజాగ్ – 4.80 కోట్లు
ఈస్ట్ – 2.04 కోట్లు
వెస్ట్ – 1.53 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 29.76 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.10 కోట్లు
ఓవర్సీస్ – 2.05 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 33.91 కోట్లు

Leave a comment