భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు తమదైన ప్రతిభతో జట్టు విజాయానికి తమ స్తతాను జోడిస్తున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి టాలెంట్ ఉన్న మీడియం పేస్ బౌలర్‌గా భారత్‌కు అనేక విజయాలను అందించిన ఇర్ఫాన్ పఠాన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించాడు పఠాన్. బంతిని స్వింగ్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఇర్ఫాన్ పఠాన్ ఎన్నో కీలకమైన మ్యాచుల్లో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.
అయితే గతకొంత కాలంగా జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తూ, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ వచ్చాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ఈ బౌలర్, 120 వన్డేలు ఆడి 173 వికెట్లు పడగొట్టాడు. అలాగే 29 టెస్టు మ్యాచులు ఆడిన పఠాన్ 100 వికెట్లు పడగొట్టాడు. ఇందులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పఠాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన సన్నివేశాన్ని భారతీయులు చిరకాలం గుర్తించుకుంటారు.
కాగా తాజాగా పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయినా ఆయన భారత క్రికెట్ జట్టుకు అందించిన విజయాలను తామెప్పుడూ గుర్తుంచుకుంటామని అంటున్నారు. కాగా పఠాన్ జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా ఆడి ఇండియన్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.