షాకింగ్ న్యూస్.. ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్.. ధైర్యం చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ అభిమానుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, అప్పుడప్పుడు చెంపలు చెళ్లుమనిపిస్తారని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కానీ బాలయ్య మనసు చాలా సున్నితనం అని, ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే వాలిపోతారని చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ అని తెలియడంతో బాలయ్యకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారట బాలయ్య.

అయితే ఎన్టీఆర్ భార్య అంటూ జూనియన్ ఎన్టీఆర్ అనుకునేరు.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ భార్యకు క్యాన్సర్ అని తేలింది. దీంతో వారు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు.

అటుపై బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాడట. బాలయ్య మంచితనం గురించి విన్నానే తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని నటుడు పి.విజయ్ కుమార్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఏదేమైనా బాలయ్య అంటే అభిమానులకు ఎందుకు అంత ఇష్టమో ఈ ఉదాహరణతో మరోసారి రుజువైంది.

Leave a comment