బన్నీ దెబ్బకు బెంబేలెత్తుతున్న మహేష్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాకు అన్ని చోట్ల అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం డీలా పడింది.

సంక్రాంతి బరిలో మహేష్, బన్నీలు పోటీ పడగా త్రివిక్రమ్ కంటెంట్‌కు మార్కులు ఎక్కువ పడటంతో సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఉన్న మహేష్ బాబు సినిమాకు అక్కడ కలెక్షన్లు తగ్గాయి. త్రివిక్రమ్ కథకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

బుధవాం నాడు అల వైకుంఠపురములో సినిమా 147 లొకేషన్లలో $102,160 రాబట్టగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా 164 లొకేషన్లలో $32,560 మాత్రమే రాబట్టింది. కాగా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేస్తే అల వైకుంఠపురములో సినిమా బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకుంటుంది. అయితే ఈ సినిమా శుక్రవారం నాటికి బ్రేక్ ఈవెన్‌కు చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా టోటల్ రన్‌లో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను అలవోకగా టచ్ చేస్తుందని వారు అంటున్నారు.

అటు సరిలేరు నీకెవ్వరు సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాలి. అయితే ఈ సినిమా కలెక్షన్లు పడిపోవడంతో టోటల్ రన్‌లో కేవలం $2.1 మిలియన్ డాలర్లు మాత్రమే కలెక్ట్ చేస్తుందని వారు అంటున్నారు. ఏదేమైనా బన్నీ దెబ్బకు మహేష్ మైండ్ బ్లాక్ అయ్యిందని సినీ క్రిటిక్స్ సెటైర్లు వేస్తున్నారు.

Leave a comment