సుకుమార్‌తో సురవరం.. త్వరలోనే ప్రారంభం

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం మంచి టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపిస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నిఖిల్ ఈ సినిమాతోనూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాగా తన నెక్ట్స్ మూవీ కోసం నిఖిల్ అప్పుడే రెడీ అవుతున్నాడు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించే కథలను సుకుమార్ రైటింగ్స్ పేరుతో తెరకెక్కించే విషయం తెలిసిందే. కాగా తాజాగా సుకుమార్ రాసిన ఓ కథలో నిఖిల్ హీరోగా నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమా కథ నచ్చడంతో పాటు సుకుమార్ లాంటి డైరెక్టర్ సినిమాలో చేయాలని నిఖిల్ ఎప్పటినుంచో చూస్తున్నాడు. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ GA2 బ్యానర్‌పై ప్రెజెంట్ చేయగా బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. ఈ సినిమాకు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలోని క్యాస్టింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment