సరిలేరు నీకెవ్వరు టీజర్‌ను రెడీ చేసిన దర్శకుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ మహేష్ బద్దలుకొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో భీబత్సమైన క్రేజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇకపోతే ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ ఇండస్ట్రీ జనం ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పార్ట్ ముగించుకున్న సరిలేరు నీకెవ్వరు టీజర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా వెల్లడించాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో గెంతులేస్తున్నారు. ఈ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడు దీన్ని వైరల్ చేద్దామా అని వారు ఆశగా చూస్తున్నారు.

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న మహేష్ యాక్టింగ్ ఈ సినిమాకే మేజర్ బలం కానున్నట్లు తెలుస్తుంది. అదిరిపోయే కథకు అదిరిపోయే క్యాస్టింగ్ తోడవడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో విజేతగా నిలవడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. మరి సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ ఎలాంటి సెన్సేషన్‌లు క్రియేట్ చేస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

Leave a comment