25గెట‌ప్స్‌తో రాబోతున్న విల‌క్ష‌ణ హీరో..!

మ‌నం చిత్ర పరిశ్ర‌మ‌లో కేవ‌లం ద‌శావ‌త‌రాలు పోషించిన హీరోను మాత్ర‌మే చూసాం.. కానీ ఇప్పుడు ఓ హీరో పాతిక అవతారాలు పోషించే స‌న్నివేశం చూడ‌బోతున్నాం.. అత‌డేమ‌న్నా ఊస‌ర‌వెళ్ళా.. ఇలా రంగులు, వేషాలు మార్చుకోవ‌డానికి అనుకుంటున్నారా.. లేక మా చెవ్వులో గుమ్మ‌డి పువ్వులు పెడుతున్నారా అని అనుకునేరు.. అయితే ఇది నిజ‌మేనండి బాబోయ్‌… మేము మీకు చెపుతుంది అక్ష‌రాల నిజం.. కాకుంటే మీరు ఓ లుక్కేయండి…

పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీరాన్ని మ‌లుచుకోవ‌డం.. త‌రుప‌రి చిత్రం కోసం వెంట‌నే త‌న వేష‌, భాష‌లు, ఆహార్యం మార్చుకోవ‌డంలో ఆ న‌టుడు దిట్ట‌.. అలాంటి విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. అప‌రిచితుడుతో త‌న న‌ట విశ్వ‌రూపం చూపిన విక్ర‌మ్ దేశ‌వ్యాప్తంగా భారీ అభిమానుల‌ను సంపాదించుకున్న హీరో. త‌న శ‌రీరాన్నే ఓ ప్ర‌యోగ‌శాల‌గా చేసి న‌ట‌న‌కే కొత్త భాష్యం చెపుతున్న విక్ర‌మ్ ఇప్పుడు ఏకంగా 25 అవ‌తారాలు పోషించ‌బోతున్నాడు..

విక్ర‌మ్‌కు తెలుగులో మార్కెట్ భారీగానే ఉంది. విక్ర‌మ్ ఏ సినిమా న‌టించినా అది తెలుగులోకి రీమేక్ కావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు రూపొందించ‌బోతున్న విక్ర‌మ్ 58వ చిత్రంలో 25 ర‌కాల గెట‌ప్స్‌లో క‌నిపించ‌బోతున్నాడు. సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహ‌మాన్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. ఇక సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌, వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. సో ఈ వేషాలు మార్చే ఊస‌ర‌వెళ్లి సినిమా వేస‌వి కాలంలో మ‌నముందుకు రాబోతుంది…

Leave a comment