సాలిడ్ డీల్‌కు అమ్ముడైన చాణక్య

మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కెరీర్‌లో అన్ని ఫ్లాపు సినిమాలతో నెట్టుకువస్తున్నాడు. కాగా హిట్టు బొమ్మ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్న గోపీచంద్ ఈసారి మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. చాణక్య అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ క్రమంలో అసలే ఫెయిల్యూర్లతో సతమతమవుతున్న గోపీచంద్ చాణక్య సినిమాకు అదిరిపోయే డీల్ కుదిరింది. థియేట్రికల్ కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలిపి ఏకంగా రూ. 15 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇందులో హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.9 కోట్లకు, తెలుగు శాటిలైట్ రైట్స్ రూ.4 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.

మొత్తంగా చూస్తే ఫ్లాపులతో నెట్టుకొస్తున్న గోపీచంద్ సినిమాకు ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్టోబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a comment