చిరు సరసన ఫేడవుట్ బ్యూటీ.. కారణం ఏంటీ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

నిజానికి ఈ సినిమాలో చిరు సరసన నయనతారను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఇటీవల సైరా చిత్రంలో వారిద్దరు కలిసి నటించడంతో ఆమెను వద్దనుకున్నారు. అటు కొరటాల శివ సినిమా అంటే ఎక్కువగా సోషల్ కాన్సెప్ట్‌కే స్కోప్ ఉంటుంది. హీరో-హీరోయిన్‌ల లవ్ ట్రాక్‌ పెద్దగా ఉండదు. దీంతో చిరు సరసన హీరోయిన్‌గా ఒకప్పటి స్టార్ బ్యూటీ త్రిషను తీసుకోవడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారట.

ఒకవేళ త్రిషను ఈ సినిమాకు ఓకే చేస్తే ఆమెకు ఇది నిజంగా మెగా ఛాన్స్ అని చెప్పాలి. మరి చిరు సరసన నటించే ఆ ఛాన్స్ చివరికి ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.