Moviesమేకప్ లేకుండా ఇంప్రెస్ చేసిన మహానటి

మేకప్ లేకుండా ఇంప్రెస్ చేసిన మహానటి

తెలుగులో మహానటి సినిమాతో యావత్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది బ్యూటీ కీర్తి సురేష్. ఆ తరువాత అమ్మడు తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందా అని చాలా మంది వెయిట్ చేశారు. కానీ తెలుగులో అమ్మడు స్ట్రెయిట్‌గా తెలుగు మూవీలో నటించలేదు. తమిళంలో సినిమాలు చేస్తున్నా తెలుగులో మాత్రం స్ట్రెయిట్‌ మూవీ చేయలేదు. దీంతో ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా చూస్తున్నారు.

అయితే వారి ఎదురుచూపులకు తెరతీస్తూ కీర్తి సురేష్ ఇప్పుడు ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించనుంది. ఈ స్ట్రెయిట్ మూవీలో కీర్తి సురేష్ ఓ క్రీడాకారిణిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అమ్మడు చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

దీపావళి కానుకగా చిత్ర టైటిల్‌ను రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తు్న్నాడు. నగేష్ కుకునూర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తు్న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news