Moviesకార్తీ ఖైదీ రివ్యూ అండ్ రేటింగ్

కార్తీ ఖైదీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: ఖైదీ
నటీనటులు: కార్తీ, నరైన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్
సంగీతం: సామ్
నిర్మాణం: డ్రీమ్ వారియర్ పిక్చర్స్

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ తెలుగులోనూ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కార్తీ మరో విజయం సాధించుకుంటాడని అతడి అభిమానులు అంచనా వేస్తున్నారు. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
జీవితఖైదు పడిన ఢిల్లీ(కార్తీ) అనే నేరస్థుడికి అతడి కూతురిని చూసేందుకు వీలు కలుగుతుంది. దీంతో ఎంతో ఆశగా బయల్దేరిన అతడికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. దారిమధ్యలో అతడికి అనుకోని ఘటనలు ఎదురుకావడంతో తన కూతురిని కలుసుకునేందుకు మరింత కఠినతరంగా మారుతుంది. ఇంతకీ అతడికి ఎదురైన ఘటన ఏమిటి..? ఈ క్రమంలో అతడు దాన్ని ఎలా ఎదుర్కొంటాడు..? చివరకు తన కూతురును కలుసుకుంటాడా లేదా అనేది సినిమా కథ.

విశ్లేషణ:
రొటీన్ సినిమాలు ఏమాత్రం సంబంధం లేని సినిమాగా ఖైదీ నిలుస్తుందని చెప్పాలి. ఈ సినిమా పూర్తిగా కంటెంట్‌ను ఆధారంగా చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఒక ఖైదీ జీవితంలో నాలుగు గంటలు జరిగే పరిమాణమే ఈ సినిమా స్టోరీగా మనముందుకు తీసుకొచ్చాడు ఈ దర్శకుడు. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా కేవలం కంటెంట్‌‌ను నమ్ముకుని ఈ సినిమాను తీశాడు దర్శకుడు.

ఫస్టాఫ్‌లో హీరో పరిచయం మొదలు అతడు జైలు నుండి బయటకు వచ్చే సీన్లు, మధ్యలో అతడికి ఎదురయ్యే సంఘటనలను బాగా చూపించాడు దర్శకుడు. ఇక ఈ సంద్భాల్లో కార్తీ చూపించిన యాక్షన్ అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది. అయితే ఆ తరువాత వచ్చే థ్రిల్లింగ్ అంశాల్లోనూ కార్తీ యాక్టింగ్ సూపర్. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఒక మంచి బ్యాంగ్‌తో ఇంటర్వెల్‌కు తీసుకెళ్లాడు దర్శకుడు.

సెకండాఫ్‌లో కార్తీ తాను ఉన్న పరిస్థితులను ఎలా అధిగమించాడనే అంశాలను బాగా చూపించాడు దర్శకుడు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కార్తీ యాక్టింగ్ పీక్స్. ఒక మంచి నోట్‌తో కథకు శుభం కార్డు వేశాడు దర్శకుడు. ఓవరాల్‌గా చూస్తే ఓ మంచి కాన్సెప్టును తాను అనుకున్న రీతిలో తెరకెక్కించడంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ సక్సె్స్ అయ్యాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఖైదీ సినిమాను వన్ మ్యాన్ ఆర్మీగా కార్తీ నిలిచాడు. సినిమాను పూర్తిగా తన భుజాలపై వేసుకుని పూర్తిగా తన పనితనం ఏమిటో చూపించాడు. అటు సినిమాలో కార్తీ పర్ఫార్మెన్స్‌ ఓ రేంజ్‌లో ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేవారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
లోకేష్ కనకరాజ్ రాసుకున్న కంటెంట్‌ను ఉన్నది ఉన్నట్లుగా చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సాధారణ ఆడియెన్స్ కాస్త నిరాశకు లోనవుతారు. అయినా లోకేష్ ఇవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నదే చేసాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేవలం నాలుగు గంటల్లో జరిగే సినిమా కావడంతో ఎక్కువగా రాత్రి సన్నివేశాలనే చాలా చక్కగా చూపించారు. సంగీత పరంగా బీజీఎం కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఖైదీ – కొద్ది మందికే నచ్చుతాడు!

రేటింగ్:
2.75/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news