పాతికతో లెక్క ముగించేసిన గద్దలకొండ గణేష్

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి చిత్రం మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చాలా ఆసక్తిగా చూశారు. అయితే కొన్ని వివాదాల కారణంగా వాల్మీకి టైటిల్‌ను కాస్త గద్దలకొండ గణేష్‌గా మార్చి రిలీజ్ చేశారు. అయినా ఆ ప్రభావం సినిమాపై పడలేదు.

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీలో వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ యాక్షన్‌కు జనాలు ఫిదా అయ్యి సినిమాను సక్సెస్ చేశారు. పూజా హెగ్డే నటన కూడా బాగుండటంతో ఈ సినిమాకు మరింత బలం చేకూరింది. ఇక ఫుల్ రన్ ముగించుకున్న ఈ సినిమా టోటల్ రన్‌లో ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూళ్లూ సాధించింది. గద్దలకొండ గణేష్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్
నైజాం – 8.74 కోట్లు
వైజాగ్ – 2.66 కోట్లు
తూ.గో – 1.61 కోట్లు
ప.గో – 1.51 కోట్లు
కృష్ణా – 1.42 కోట్లు
గుంటూరు – 1.83 కోట్లు
నెల్లూరు – 0.89 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.92 కోట్లు
సీడెడ్ – 3.45 కోట్లు
టోటల్ ఏపీ/టీఎస్ క్లోజింగ్ కలెక్షన్స్ – 22.11 కోట్లు
కర్ణాటక – 1.33 కోట్లు
యూఎస్ – 1.08 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.33 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ – 25.15 కోట్లు

Leave a comment