మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ పాన్ ఇండియన్ సినిమా సైరా. రూ.280 కోట్ల భారీ బడ్జెట్‌తో కొణిదెల కంపెనీ ప్రొడక్షన్‌పై చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక సైరా వరల్డ్‌వైడ్‌గా రూ. 200 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. దీనికి ఏరియా వైజ్ ప్రింట్ .. పబ్లిసిటీ ఖర్చులు వేరే ఉంటాయి. సైరా సినిమా హిట్టు అని చెప్పాలంటే 200-240 కోట్ల మేర షేర్ వసూలు చేయాలి. 300 కోట్లు అంతకుమించి తే బ్లాక్ బస్టర్ హిట్టు అయినట్టే. ఇక ఇప్పటికే సైరా హంగామా స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 2న మొత్తం ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సైరా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
సైరా వరల్డ్ వైడ్ ఏరియాల వారీ ప్రి రిలీజ్ బిజినెస్ ( రూ.కోట్లలో ) :
నైజాం – 30 కోట్లు
సీడెడ్ – 22 కోట్లు
నెల్లూరు – 5.20 కోట్లు
కృష్ణా – 9.60 కోట్లు
గుంటూరు – 11.50 కోట్లు
వైజాగ్ – 14.40 కోట్లు
ఈస్ట్ – 10.40 కోట్లు
వెస్ట్ – 9.20 కోట్లు
———————————————
ఆంధ్రా + తెలంగాణా =112.30 కోట్లు
———————————————–
కర్ణాటక – 28 కోట్లు
తమిళనాడు – 7.50 కోట్లు
కేరళ – 2.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 27.50 కోట్లు
విదేశాలు – 20 కోట్లు
—————————————
వరల్డ్ వైడ్ బిజినెస్ = 200 కోట్లు
—————————————