రామ్‌చ‌ర‌ణ్‌ను క‌న్నీళ్లు పెట్టించిన సినిమా అదేనంట !

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న “RRR” సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మ‌రోవైపు త‌న బ్యాన‌ర్‌పై త‌న తండ్రి హీరోగా తెర‌కెక్కిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ప్ర‌మోష‌న్ల‌లో సైతం చ‌ర‌ణ్ చాలా బిజీగా ఉన్నాడు. సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా అక్టోబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌మోష‌న్లు ఐదు భాష‌ల్లోనూ కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా చెన్నైలో జరిగిన‌ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తనను ఈ మధ్య కాలంలో ఎమోషనల్‌గా కంటతడి పెట్టించిన సినిమా కోసం ప్రస్తావించారు. ఇక ఇప్పుడు చెర్రీ నిర్మాత‌గా తెర‌కెక్కిన సైరాలో కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ మాట్లాడుతూ విజయ్ సేతుపతి నటించిన “96” సినిమా చూసి కంటతడి పెట్టుకున్నానని,ఆ చిత్రంలో విజయ్ సేతుపతి నటన తనను అమితంగా ఆకట్టుకుందని ప్ర‌శంసించాడు. విజ‌య్ త‌న‌ను మొద‌టి సారి క‌లిసిన‌ప్పుడు ఒక నిమిషం పాటు హత్తుకుని విజయ్‌కు అభినందనలు తెలిపానని వెల్లడించారు.

ఏదేమైనా మ‌న టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న చ‌ర‌ణ్ కోలీవుడ్ యంగ్ హీరోకు అభిమానిగా మారిపోవ‌డం విశేష‌మే. ఇక సైరాలో అమితాబ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, సుదీప్ లాంటి క్రేజీ తారాగ‌ణం న‌టించారు.

Leave a comment