సైరాకు దెబ్బేసిన సాహో

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల మేనియా నడుస్తోంది. ఇప్పటికే ఈ కోవలో బాహుబలి సీరీస్ చిత్రాలు ప్రపంచాన్ని గడగడలాడించాయి. ఇక రీసెంట్‌గా ప్రభాస్ నటించిన సాహో కూడా ఆ కోవకే చెందింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి క్రేజ్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే. కానీ సినిమా రిలీజ్ తరువాత ఆ క్రేజ్‌ను క్యా(ష్)చ్ చేయడంలో సినిమా బొక్కబోర్లా పడింది. ఇప్పుడు ఇదే భయం మరో భారీ సినిమాను వణికిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహా రెడ్డి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాను సాహో ఫీవర్ భయపెడుతోంది. రిలీజ్‌కు ముందు క్రియేట్ చేసిన హైప్‌ను సైరా క్రియేట్ చేయడంలో నెమ్మదించింది. ఇక బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాను సాహో స్థాయిలో చేయాలని బయ్యర్లు అనుకోవడం లేదు. దీంతో నార్మల్ రేటు కంటే కాస్త ఎక్కువ రేటుకు మాత్రమే సైరాను కొన్నట్లు తెలుస్తోంది. అటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో హైప్ క్రియేట్ చేసే ఆలోచనను కూడా చిత్ర యూనిట్ పక్కకు పెట్టేశారు.

ఇదంతా చూస్తుంటే సాహో దెబ్బ సైరాకు బాగానే తగిలినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని సినిమాపై సాహో స్థాయి క్రేజ్‌ను పెంచేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధంగా లేరని తెలుస్తోంది. మరి ఈ సినిమా కూడా సాహో రిజల్ట్‌ను రిపీట్ చేస్తుందా లేక మెగాస్టార్ క్రేజ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారా అనేది చిత్రం రిలీజ్ అయిన తరువాత తెలుస్తోంది.

Leave a comment