ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆ సినిమాతో ఎక్కడా లేని బోల్డ్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత పాయల్‌కు ఒకటీ అరా ఛాన్సులు వచ్చినా ఆ టైప్ ఛాన్సులే వస్తున్నాయి. తాజాగా ఆమె ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో మరోసారి అదే బోల్డ్నెస్, అదే హాట్నెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ నిర్మాత కాగా శంకర్ భాను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లోనే పాయల్ ఎంత హాట్ హాట్‌గా రచ్చ చేసిందో చూశాం. ఇక ట్రైలర్లో మాత్రం ఆమె అందాల ఆరబోతతో పాటు కాస్త నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించినట్టు తెలుస్తోంది.
ట్రైలర్లో ఆమె చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు… అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకు మగసింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది –
అమ్మాయితో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్రతిమిలాడండి కరిగిపోతారు… అబద్ధం చెప్పి బాధపెట్టొద్దు.. కరిగించేస్తారు అని చెపుతుంది. ఈ డైలాగులను బట్టి చూస్తే పాయల్ పాత్రకు అందాల ఆరబోతతో పాటు నటనా పరంగా కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది.
ఇక టీజర్లో పాయల్ యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించింది. తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో సీనియర్ హీరో నరేష్ కూడా కీలక పాత్రలో నటించాడు. మరి ట్రైలర్‌తో ఆకట్టుకున్న పాయల్ సినిమలో ఏం చేస్తుందో ? చూడాలి.