మాస్ క్యారెక్ట‌రే కావాలంటున్న హీరో…!!

అత‌డు చూడ‌టానికి చాలా స్మార్ట్‌గా ఉంటాడు. పంచ్‌ల‌కు డోకా లేదు. న‌ట‌న‌లో తేడా రానివ్వ‌డు.. ల‌వ‌ర్ బాయ్‌గా చూడ‌టానికి భ‌లేగా ఉంటాడు.. కానీ ఎందుకో మాస్ సినిమాలే కావాలంటున్నాడట‌.. ఓ మంచి ల‌వ‌ర్ బాయ్ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా వ‌ద్ద‌నుకుని ఏకంగా మాస్ సినిమా క‌థే కావాలంటూ మంకుప‌ట్టు ప‌ట్టుకుని కూర్చున్నాడ‌ట‌… ఇంత‌లా మాస్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ హీరో ఎవ‌రు అనుకుంటున్నారా… ఇంకెవ‌రు.. ఇస్మార్ట్ శంక‌ర్ ఉర‌ఫ్ రామ్ పోతినేని.

రామ్ ల‌వర్ బాయ్‌లా స్మార్ట్‌గా ఉంటాడ‌న్న విష‌యం అందిరికి తెలిసిందే. ఇప్ప‌టికే అనేక సినిమాల్లో ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు కూడా.. ల‌వ‌ర్ బాయ్‌గా న‌టించి మొహం మెత్తిందో ఏమో ఇప్పుడు ల‌వ‌ర్ బాయ్ సినిమాలు వ‌ద్దు బాబోయ్‌.. మాస్ మ‌సాలా ఉన్న సినిమాలే కావాలంటున్నాడ‌ట‌. అందుకే మంచి సినిమా అవ‌కాశం వచ్చినా దాన్ని కాద‌న్నాడ‌ట‌.

రామ్ కు స‌రిపోయే క‌థ త‌మిళంలో దొరికింద‌ట‌. ఈ క‌థ‌ను త‌న పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ కొన్నాడ‌ట‌. సాహో సినిమాలో న‌టించిన అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడుగా తెర‌కెక్కిన చిత్రం త‌డ‌మ్‌. ఈ సినిమా తమిళ‌నాట బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ అయింద‌ట‌. అయితే ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను స్ర‌వంతి ర‌వికిషోర్ తీసుకుని రామ్‌కు వినిపించాడ‌ట‌. ముందుగా ఓకే అన్న‌త‌రువాత ఇస్మార్ట్ శంక‌ర్ ఇచ్చిన మాస్ కిక్‌తో ఇక మాస్ మ‌త్తులో మునిగితేలుతూ త‌డ‌మ్ సినిమాను కాద‌న్నాడ‌నే టాక్ ఉంది. అంటే ఒంటిపై చెటాక్ మాంసం లేకున్నా మాస్ సినిమాలో ఉర్రూత‌లూగొచ్చ‌నే ఈ హీరోగారికి మ‌రో మాస్ సినిమా క‌థ దొరికేద‌న్న‌డో… ఆయ‌న అభిమానులను మెప్పించేదెన్న‌డో కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

Leave a comment